NTPC : మా ప్రతిష్ఠ మంటగలిసిపోతోంది మహా ప్రభో.. వెంటనే పేరు మార్చుకోండి : ఆర్ఆర్బీకి ఎన్టీపీసీ లేఖ
NTPC : ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ.. ఈ రెండు పదాలు కొన్ని రోజులుగా బాగా వార్తల్లో నానుతున్నాయి. ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ బిహార్‌లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు

NTPC : ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ.. ఈ రెండు పదాలు కొన్ని రోజులుగా బాగా వార్తల్లో నానుతున్నాయి. ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ బిహార్‌లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలు రైళ్లకు నిప్పు కూడా పెట్టారు. దీంతో బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక వాతావరణం ఏర్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఎన్టీపీసీ (ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ) స్పందించింది. రైల్వే బోర్డుకు ఓ లేఖ కూడా రాసింది. రైల్వేకు సంబంధించిన ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పేరును వెంటనే మార్చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ పరీక్షల వల్ల తెలియకుండానే తమ సంస్థకు చెడ్డ పేరువస్తోందని, ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందని ఎన్టీపీసీ ఆక్షేపించింది.
తెలియకుండానే తాము వివాదాల సుడిగుండంలో ఇరుక్కున్నామని, మీడియాతో సహా చాలా మంది ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) ని ఎన్టీపీసీ అనే వాడేస్తున్నారని, దీని వల్ల తమ ప్రతిష్ఠ మంటగలిసి పోతోందని ఆ లేఖలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఏ పోస్టులకైనా ఖాళీలను భర్తీ చేసే సమయంలో మీ పూర్తి రూపాన్ని రాస్తూనే ప్రకటన ఇవ్వండి. దీని ద్వారా అటు సోషల్ మీడియాలో, అటు పత్రికల్లో, సమాజంలో తప్పుడు సిగ్నల్స్ వెళ్లే ఛాన్స్ ఉండదు. సమాజంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. పరీక్ష పేరును మార్చమని కోరుతున్నాం. భవిష్యత్తులో ఎలాంటి గందరగోళానికి తావివ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుకు లేఖ రాసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

