Watch: ఢిల్లీలో ఆకట్టుకున్న అంతరిక్ష నేపథ్య పోలింగ్ కేంద్రం.. ఓటర్లకు సహకరించిన వ్యోమగాములు
(Space-Themed Polling Station | దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. అంతరిక్షం థీమ్‌తో ఈ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. వ్యోమగాముల డ్రెస్ ధరించిన వాలంటీర్లు ఓటర్లకు సేవలందించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. అంతరిక్షం థీమ్‌తో ఈ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. (Space-Themed Polling Station) వ్యోమగాముల డ్రెస్ ధరించిన వాలంటీర్లు ఓటర్లకు సేవలందించారు. ఢిల్లీలోని వికాస్పురిలో ‘చంద్రయాన్ సే చునావ్ తక్ భారత్ కీ ఉడాన్’ అనే థీమ్‌తో ప్రత్యేకమైన అంతరిక్ష నేపథ్యంతో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో భారత ప్రగతికి సంబంధించిన రాకెట్ ప్రయోగాలు వంటి నమూనాలు ఇందులో ఉంచారు.
కాగా, వ్యోమగాముల మాదిరిగా డ్రెస్ ధరించిన వాలంటీర్లు ఇక్కడకు వచ్చిన ఓటర్లకు సేవలందించారు. అలాగే ఈ పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన టెలిస్కోప్‌లు, బయోస్కోప్లతో ఓటర్లు అద్భుతమైన అనుభవం, ఆనందం పొందారు. ప్రత్యేకమైన ఈ పోలింగ్ బూత్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | #DelhiAssemblyElection2025 | A unique polling station has been set up in Delhi’s Vikaspuri with the theme ‘Chandrayan se chunav tak Bharat ki udaan’. Telescopes and bioscopes have been installed and volunteers have been dressed up as astronauts to assist voters. pic.twitter.com/gRUg4gP8Ub
— ANI (@ANI) February 5, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

