మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి డిమాండ్

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ అయిన ఆయన ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులు కలిగిన వాహనం కలకలం రేపడం, ఈ కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజేపై ఆరోపణలు రావడం, సచిన్ వాజేను వంద కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అడిగారంటూ బదిలీ అయిన ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపిస్తూ సిఎం ఉద్ధవ్‌కు లేఖ రాయడం వంటి అంశాలతోపాటు మరికొన్నింటిని అందులో పేర్కొన్నారు.
శాంతిభద్రతల విషయంలో మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని రామ్‌దాస్ అథవాలే విమర్శించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అధ్యక్ష పాలన విధించాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ఈ మేరకు ఒక లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి పంపినట్లు ఆయన ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

