Live-In Relationships: సహజీవనం తప్పు.. సమాజానికి వ్యతిరేకం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Live-In Relationships: సహజీవనంపై కేంద్ర మంత్రి నితిన గడ్కరీ కామెంట్ చేశారు. అది తప్పుడు విధానమన్నారు. సమాజానికి వ్యతిరేకం అన్నారు. యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: సహజీవనం(Live-In Relationships) తప్పుడు విధానమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇది సమాజ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలతో.. సామాజిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. యూట్యూబ్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో అతి పెద్ద సమస్య సహజీవనమే అని, పెళ్లిని వ్యతిరేకించడం పెద్ద సమస్యగా మారినట్లు ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ వెళ్లినప్పుడు అక్కడ తమకు తెలిసిందన్నారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే, అప్పుడు మీరెలా పిల్లల్ని కంటారని గడ్కరీ అడిగారు. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల భవిష్యత్తు ఏంటి ఆయన ప్రశ్నించారు. సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్తే, అది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ప్రశ్నించినట్లు తెలిపారు.
సమాజం తనంతటే తాను నిర్ణయాలు తీసుకుంటుందని, కానీ దేశంలో లింగ నిష్పత్తి సమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ 1500 మంది మహిళలు, 1000 మంది పురుషులు ఉంటే, అప్పుడు ఇద్దరు భార్యలకు పురుషుల అర్హులని ఆయన అన్నారు. ఆదర్శ భారత దేశంలో విడాకుల్ని బ్యాన్ చేయాలన్న దాన్ని ఆయన ఖండించారు. సహజీవనం మంచిది కాదన్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను వ్యతిరేకిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టుకు చెందిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

