దేశమే ధనికం.. ప్రజలు నిరుపేదలే!
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..దేశం అభివృద్ధి చెందినా.. ప్రజలు మాత్రం నిరుపేదలుగా మారిపోతున్నారని తెలిపారు.
- కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలు
నాగ్‌పూర్, సెప్టెంబర్ 29: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..దేశం అభివృద్ధి చెందినా.. ప్రజలు మాత్రం నిరుపేదలుగా మారిపోతున్నారని తెలిపారు. ‘భారత్ వికాస్ పరిషత్’ గురువారం నిర్వహించిన సమావేశంలో గడ్కరీ మాట్లాడారు. ఆకలి, నిరుద్యోగం, కులం, అంటరానితనం, ద్రవ్యోల్బణంలాంటి సమస్యలతో దేశం సతమతమవుతున్నదని వ్యాఖ్యానించారు. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం భారీగా పెరుగుతున్నదని, ఇది సమాజ పురోగమనానికి మంచిదికాదని ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని అధిగమించాల్సిన అవసరముందన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక సమానత్వం నెలకొల్పాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలు తొలగించేందుకు విద్య, వైద్యం, సేవల రంగాల్లో కృషిచేయాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

