Rameshwaram Cafe Blast | రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
Rameshwaram Cafe Blast : బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేసి దర్యాప్తును ప్రభావితం చేసేలా కర్నాటక మంత్రులు వ్యవహరించరాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Rameshwaram Cafe Blast : బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేసి దర్యాప్తును ప్రభావితం చేసేలా కర్నాటక మంత్రులు వ్యవహరించరాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మంత్రులను నిలువరించాలని సీఎం సిద్ధరామయ్య, బెంగళూర్ పోలీస్ కమిషనర్లకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే పేలుడు జరిగిందని, రాజకీయ శత్రుత్వమే ఇందుకు కారణమని పేర్కొనడం వంటి రాష్ట్ర మంత్రుల ప్రకటనలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఊహాగానాలకు దూరంగా ఉండాలని బెంగళూర్ పోలీస్ కమిషనర్ బి దయానంద మీడియాకు చేసిన వినతి నేపధ్యంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం కేఫ్ ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని, పలు బృందాలు దీనిపై పనిచేస్తున్నాయని, కేసు సున్నితత్వం, భద్రతా ఆందోళనల దృష్ట్యా మీడియా ఊహాగానాలు వ్యాప్తి చేయకుండా సహకరించాలని కమిషనర్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనను రాజకీయం చేయవద్దని విపక్షాలకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు అనుమానితుడు పేలుడు పదార్ధాలతో కూడిన బ్యాగ్‌తో కేఫ్ వైపు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. అనుమానితుడు యువకుడని అతడి వయసు 28 నుంచి 30 ఏండ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకునేందుకు పలు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
Read More :
Rihanna: ప్రీ వెడ్డింగ్‌లో జోష్ నింపిన రిహాన్నా.. వీడియోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

