జామ్‌నగర్: పాప్ సింగర్ రిహాన్నా(Rihanna) తన ట్యాలెంట్‌తో కిక్కెకించింది. చార్ట్‌బస్టర్‌లో టాప్ సాంగ్స్‌ను పాడి.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఊపు తెచ్చింది. బాడీ హగ్గింగ్ ఎల్లో ఔట్ఫిట్ డ్రెస్సులో .. రిహాన్నా స్పెషల్‌గా థ్రిల్ పుట్టించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన అతిథులు రిహాన్నా సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ మైమరిచిపోయారు.
రిహాన్నా షో కోసం జామ్‌నగర్‌లో ప్రత్యేక సెట్‌ను వేశారు. తన ట్రూప్‌తో కలిసి రిహాన్నా .. పాప్ సాంగ్స్‌ను పాడింది. రిహాన్నా టీమ్ చేసిన పర్ఫార్మెన్స్కు అతిథులు స్టన్ అయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మూడు రోజుల పాటు జరగనున్నది. రిహాన్నా సాంగ్ పాడుతున్న సమయంలో.. వేడుకకు వచ్చిన అతిథులు కూడా తన్మయత్వంతో చిందేశారు.
రిహాన్నా ఈ పర్ఫార్మెన్స్ కోసం సుమారు 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వెలుబడ్డాయి. అయితే రిహాన్నా టీమ్‌లో బ్యాక్‌గ్రౌండ్ సింగర్స్, డ్యాన్సర్లు కూడా ఉన్నారు.