Dharmendra Pradhan | డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్ ప్రశ్నపత్రం.. పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు.
Dharmendra Pradhan | న్యూఢిల్లీ, జూన్ 20: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. మంగళవారం ఈ పరీక్ష జరగగా, పరీక్షను రద్దు చేస్తున్నట్టు బుధవారం ఎన్టీఏ ప్రకటించింది. అయితే, పరీక్ష రద్దుకు స్పష్టమైన కారణాలను ఎన్టీఏ వెల్లడించలేదు. గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ.. డార్క్‌నెట్‌లో ఉన్న ప్రశ్నాపత్రం అసలైన యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రంతో సరిపోలుతున్నదని తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఎన్టీఏపై సమీక్షకు ఉన్నత స్థాయి కమిటీ
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితమయ్యే అక్రమాల ప్రభావం నిజాయితీగా ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై పడకూడదని పేర్కొన్నారు. మన వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని, అక్రమాలు లేదా మాల్‌ప్రాక్టీస్‌లను తమ ప్రభుత్వం సహించదని పేర్కొన్నారు. ఎన్టీఏ పనితీరుపై సమీక్షకు త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీ ఎన్టీఏ పనితీరు మెరుగయ్యేందుకు తగు సూచనలు చేస్తుందని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నెట్ పరీక్షపై ఫిర్యాదులు రాలేదు: ఎన్టీఏ
యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైశ్వాల్ తెలిపారు. అయితే, భద్రతా సంస్థల నుంచి తమకు అందిన సమాచారం.. పరీక్ష సమగ్రత లోపించిందనే విషయాన్ని సూచించిందని, విద్యార్థుల ప్రయోజనాలకు రక్షణ కల్పించేందుకు సుమోటోగా పరీక్షను రద్దు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ విషయం ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్నందున ఎలాంటి సమాచారం అందిందనే విషయాన్ని వెల్లడించలేమని తెలిపారు. నెట్ పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

