మహాభారతానికి యునెస్కో గుర్తింపు
మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, రాజతరంగిణి గ్రంథాలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్ 11వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎస్సీఏ) తెలిపింది. ఈ మూడు గ్రంథాల నామినేషన్ పత్రాల తయారీలో ఐజీఎస్సీఏ కీలక పాత్ర పోషించింది.
- అర్థశాస్త్రం, రాజతరంగిణికి కూడా..
న్యూఢిల్లీ: మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, రాజతరంగిణి గ్రంథాలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్ 11వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎస్సీఏ) తెలిపింది. ఈ మూడు గ్రంథాల నామినేషన్ పత్రాల తయారీలో ఐజీఎస్సీఏ కీలక పాత్ర పోషించింది.
మహాభారతం బూర్జపత్రంపై రాసిన ప్రాచీన ప్రతికి, అర్థశాస్ర్తానికి సంబంధించి తాళపత్ర ప్రతికి, రాజతరంగిణి మాన్యుస్క్రిప్టుకు ఈ గుర్తింపు లభించింది. మహాభారతాన్ని పుణెలోని భండార్కర్ ఓరియంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, అర్థశాస్ర్తాన్ని మైసూరులోని ఓరియంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, రాజతరంగిణిని శ్రీనగర్‌లోని శ్రీ ప్రతాప్ సింగ్ లైబ్రరీ కాంప్లెక్స్‌లో ఉన్న ఓరియంటల్ రిసెర్చ్ లైబ్రరీలో భద్రపరిచారు. ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందిన స్క్రిప్టులు, గ్రంథాల సంఖ్య ఆరుకు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

