మోదీ సర్కార్ నిర్వాకం : భారత్‌లో 16 నెలల గరిష్ట స్ధాయికి నిరుద్యోగ రేటు!
ఉపాధి లభించక యువత ఎంతటి విపత్కర పరిస్ధితులను ఎదుర్కొంటున్నదో స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేశాయి. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది డిసెంబర్లో నిరుద్యోగ రేటు 16 నెలల గరిష్ట స్ధాయిలో 8.30 శాతానికి ఎగబాకింది.
న్యూఢిల్లీ : ఉపాధి లభించక యువత ఎంతటి విపత్కర పరిస్ధితులను ఎదుర్కొంటున్నదో స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేశాయి. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది డిసెంబర్లో నిరుద్యోగ రేటు 16 నెలల గరిష్ట స్ధాయిలో 8.30 శాతానికి ఎగబాకింది. నవంబర్‌లో నిరుద్యోగ రేటు 8 శాతం కాగా డిసెంబర్లో అది 8.3 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు స్పష్టం చేశాయి.
అంతకుముందు నెలలో 8.96 శాతంగా ఉన్న నగర ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు డిసెంబర్లో ఏకంగా 10.09 శాతానికి ఎగబాకింది. కొంతలో కొంత ఊరటగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 7.55 శాతం నుంచి 7.44 శాతానికి తగ్గింది. సీఎంఐఈ గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు డిసెంబర్లో 16 నెలల గరిష్టస్ధాయిలో 8.30 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కోట్లాది మంది యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం మోదీ సర్కార్ ముందున్న సంక్లిష్ట సవాల్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక హర్యానాలో నిరుద్యోగ రేటు డిసెంబర్లో అత్యధికంగా 37.4 శాతానికి పెరిగిందని, రాజస్ధాన్‌లో ఇది 28.5 శాతం కాగా దేశ రాజధాని ఢిల్లీలో నిరుద్యోగ రేటు ఏకంగా 20.8 శాతంగా నమోదైందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cmie
- India
- unemployment
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

