Ruchira Kamboj | తీవ్రవాదులకు సహకరిస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలి : యూఎన్‌లో రుచిరా కాంబోజ్
Ruchira Kamboj | సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ
Ruchira Kamboj | సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూప్‌లు సరిహద్దుల గుండా అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్నాయని.. ఇందులో డ్రోన్లు సైతం ఉన్నాయన్నారు. టెర్రరిస్టు గ్రూప్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బట్టి వారికి ఎవరు సహాయం అందిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు.
ఏ దేశం సహాయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను సేకరించలేరన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నాయన్నారు. నేరాలకు పాల్పడడమే కాకుండా.. కరెన్సీని నకిలీ చేయడం, చెలామణి చేయడం, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఇతర మార్గాలను సరఫరా చేయడం వంటి మార్గాల ద్వారా హాని కలిగిస్తున్నారన్నారు.
తీవ్రవాద గ్రూపులు, వారికి మద్దతిచ్చే వారిపై ఐక్యరాజ్యసమితి ఏ మాత్రం సహనం చూపించొద్దని ఆమె కోరారు. ఉగ్రవాదులు హింసను కొనసాగించేందుకు ఆయుధాలను అందించడం ద్వారానే అతిపెద్ద సహాయాన్ని అందజేస్తున్నామన్నారు.
కౌన్సిల్ తీవ్రవాద అంశాల పట్ల, వారికి మద్దతిచ్చే వారి పట్ల ఏమాత్రం సహనం చూపకపోవడం చాలా ముఖ్యమన్నారు. సరిహద్దు ఉగ్రవాదం, అక్రమ ఆయుధాలను ఉపయోగించి ఉగ్రవాద గ్రూపులు చేస్తున్న హింసతో భారతదేశం ఇబ్బంది పడుతుందన్నారు. ఉగ్రవాదులకు చిన్నపాటి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అందించడం వల్ల కలిగే నష్టాలను భారత్‌కు తెలుసునన్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో పెరుగుతున్న ఆయుధాలు చూస్తుంటే ఏ దేశం సహాయం లేకుండా వాళ్లు విజృంభించలేరని అర్థమవుతోంది. డైవర్షన్ పాయింట్లు, ట్రాఫికింగ్ మార్గాలను గుర్తించేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని నొక్కి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

