యూకే వేరియంట్ వల్లే ఢిల్లీలో భారీగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి యూకే వేరియంటే కారణమని తేలింది. శాంపిళ్లను విశ్లేషించడం ద్వారా దీని వెనుక ఉన్నది యూకే స్ట్రెయిన్ అని తేలినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) వెల్లడించింది. ఢిల్లీలో 400 కేసులు యూకే స్ట్రెయిన్కి, 76 ఇండియన్ డబుల్ మ్యుటెంట్ కేసులు కనిపించినట్లు ఎన్సీడీసీ తెలిపింది. దేశంలోని మొత్తం శాంపిళ్లలో 11 శాతం ఆందోళనకర వేరియంట్లు ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.
ఇప్పటివరకు ఇండియాలో మొత్తం 1644 యూకే వేరియంట్ కేసులు, 112 సౌతాఫ్రికా, 732 బ్రెజిల్ వేరియంట్ కేసులు ఉన్నాయి. మార్చిలోనే ఢిల్లీ శాంపిళ్లను పరిశీలించగా యూకే వేరియంట్ రెట్టింపై మొత్తంలో 50 శాతానికి చేరినట్లు ఎన్సీడీసీ చెప్పింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న పది ల్యాబ్‌లలో ఎన్సీడీసీ కూడా ఒకటి.
దీనిని బట్టి ఢిల్లీలో కేసులు పెరగడానికి ప్రత్యక్షంగా యూకే వేరియంట్‌కే సంబంధం ఉన్నట్లు తేలిపోతుందని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో యూకే వేరియంట్, డబుల్ మ్యుటెంట్ రెండూ ఉన్నాయి. మార్చి 2న మొత్తం కేసుల్లో 28 శాతంగా ఉన్న యూకే వేరియంట్ కేసులు మార్చి చివరి వారంలో 50 శాతానికి చేరాయి. దీనినిబట్టే యూకే కేసుల పెరుగుదలలో యూకే వేరియంట్‌కు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు అని సుజీత్ కుమార్ అన్నారు.
మొత్తం 15,135 శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఇందులో ఈ మూడు వేరియంట్లు కలిపి 11.5 శాతం అంటే 1735 ఉన్నాయి. ఇక మహారాష్ట్రలోనూ 64 యూకే వేరియంట్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలోనూ 170 యూకే వేరియంట్ కేసులు ఉన్నట్లు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలింది. మరో 57 సౌతాఫ్రికా వేరియంట్ కేసులు, మూడు డబుల్ మ్యుటెంట్ కేసులు తెలంగాణలో ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

