Aadhaar Update: ఆన్లైన్లో ఆధార్ అప్డేట్.. సెప్టెంబర్ 14 వరకు డెడ్‌లైన్ పొడిగింపు
Aadhaar Update: ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించారు. ఆన్లైన్లో అప్డేట్ కోసం డెడ్‌లైన్‌ను సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడగించారు. ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రెస్, పుట్టిన రోజు, వయసు, లింగం, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రిలేషన్షిప్ స్టేటస్ లాంటి వివరాలను మార్చుకోవచ్చు.
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలంటే, ఆ డెడ్‌లైన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగించారు. నిజానికి జూన్ 14 వరకే ఆధార్ అప్డేట్ సౌకర్యం ఉండే. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా సరిగ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆధార్‌ను అప్డేట్ చేసే తేదీని పొడిగించినట్లు యూఐడీఏఐ తెలిపింది. ప్రస్తుతం కల్పించిన అప్డేట్ సౌకర్యం ప్రకారం.. ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రెస్, పుట్టిన రోజు, వయసు, లింగం, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రిలేషన్షిప్ స్టేటస్ లాంటి వివరాలను మార్చుకోవచ్చు. అయితే ఆన్లైన్లో జరిగే ఆధార్ అప్డేట్లో ఐరిస్ స్కాన్లు, ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ ఫోటోగ్రాఫ్‌లను మార్చడం కుదరదు. పుట్టిన తేదీ మార్చే విషయంలో ఒక కండీషన్ పెట్టారు. ఆధార్ రిజిస్టర్ చేసిన తేదీ నుంచి మూడేళ్ల వరకు మాత్రమే పుట్టిన తేదీని మార్చే అవకాశం కల్పించారు. ఇక జెండర్ విషయంలో ఒకేసారి మాత్రమే ఆధార్‌లో మార్పు చేసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

