శివసేన, రెబల్ వర్గాలు పోటాపోటీగా దసరా సభలు… ఇరు వర్గాల మద్దతుదారులు ఘర్షణ
షిండే వర్గం మద్దతుదారులు ఒక వాహనంలో వెళ్తూ ఉద్ధవ్ శివసేనకు చెందిన మహిళల పట్ల అభ్యంతరకరంగా సైగలు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, ఇతర శివసేన కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న రెబల్ వర్గం వారిపై దాడి చేశారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన, రెబల్ వర్గాలు పోటాపోటీగా దసరా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. శివసేన ఏర్పడిన 56 ఏళ్ల తర్వాత ఆ పార్టీ రెండుగా చీలి దసరా వేడుకలను వేర్వేరుగా నిర్వహించడం ఇదే తొలిసారి. బీజేపీ మద్దతులో సీఎం పదవిని చేపట్టిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గం ముంబై శివారులోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వద్ద ఎంఎంఆర్డీఏ గ్రౌండ్లో బుధవారం దసరా వేడుకలు నిర్వహిస్తున్నది. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన బాంబే హైకోర్టు ఆదేశాలతో బాంద్రాలోని చారిత్రక శివాజీ పార్కులో దసరా సభ ఏర్పాటు చేసింది. శివసేన ఏర్పడిన 1966 నుంచి ప్రతిఏటా దసరా వేడుకలను ఈ పార్కులోనే ఆ పార్టీ నిర్వహిస్తున్నది.
కాగా, పోటాపోటీగా దసరా సభల నేపథ్యంలో ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన మహిళలు, కొందరు వ్యక్తులు నాసిక్ నుంచి ముంబైకి బస్సులో వెళ్తున్నారు. అయితే షిండే వర్గం మద్దతుదారులు ఒక వాహనంలో వెళ్తూ ఉద్ధవ్ శివసేనకు చెందిన మహిళల పట్ల అభ్యంతరకరంగా సైగలు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, ఇతర శివసేన కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న రెబల్ వర్గం వారిపై దాడి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

