Video: ఉదయ్‌పూర్ కిల్లర్స్‌పై కోర్టు వద్ద దాడి… నిందితుల దుస్తులు చింపేసిన జనం
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ తల నరికి దారుణంగా హత్య చేసిన కిల్లర్స్‌పై కోర్టు వద్ద జనం దాడి చేశారు. నిందితుల దుస్తులు చింపేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకులను వెంటనే వ్యాన్‌లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మకు మద్దతుగా ఉదయ్‌పూర్‌కు చెందిన 48 ఏళ్ల కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. దీనికి ప్రతీకారంగా రియాజ్ అఖ్తరీ, గోస్ మొహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం దారుణంగా కన్హయ్య తల నరికి హత్య చేశారు. దీనిని రికార్డు చేసి వీడియోను విడుదల చేశారు. అంతేగాక ప్రధాని మోదీని కూడా నిందితులు బెదిరించారు.
కాగా, కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై పారిపోతున్న హంతకులు రియాజ్ అఖ్తరీ, గోస్ మొహమ్మద్‌ను రాజస్థాన్ పోలీసులు చాకచక్యంగా అడ్డుకుని అరెస్ట్ చేశారు. అలాగే కన్హయ్య టైలర్ షాపు వద్ద రెక్కీకి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను జైపూర్‌లోని ఎన్ఐఏ కోర్టులో శనివారం హాజరుపర్చారు. దీంతో నిందితులను ఈ నెల 12 వరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అప్పగించింది.
అనంతరం నిందితులను కోర్టు నుంచి తరలిస్తుండగా అక్కడకు పెద్ద సంఖ్యలో చేరిన జనం వారిపై దాడి చేశారు. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ జనం ఆగ్రహాన్ని నిలువరించడం కష్టమైంది. కొందరు వ్యక్తులు నిందితులను కొట్టగా మరి కొందరు వారి దుస్తులు లాగి చించివేశారు. అయితే పోలీసులు వెంటనే నిందితులను పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా కొందరు న్యాయవాదులు, స్థానికులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
#WATCH | Udaipur murder incident: Accused attacked by an angry crowd of people while being escorted by police outside the premises of NIA court in Jaipur
All the four accused were sent to 10-day remand to NIA by the NIA court, today pic.twitter.com/1TRWRWO53Z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

