Uber driver | ప్రయాణీకులకు ఉచిత స్నాక్స్, వైఫై ఆఫర్ చేస్తున్న ఊబర్ డ్రైవర్
. మీ క్యాబ్ డ్రైవర్ (Uber driver) రైడ్ క్యాన్సిల్ చేయకపోవడంతో పాటు మీకు ఉచితంగా స్నాక్స్, వాటర్, వైఫై, పెర్ఫ్యూం వంటివి అందిస్తే మీరు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు.
న్యూఢిల్లీ : క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలని ప్రతి కస్టమర్ కోరుకుంటాడు. మీ క్యాబ్ డ్రైవర్ (Uber driver) రైడ్ క్యాన్సిల్ చేయకపోవడంతో పాటు మీకు ఉచితంగా స్నాక్స్, వాటర్, వైఫై, పెర్ఫ్యూం వంటివి అందిస్తే మీరు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. ఢిల్లీకి చెందిన ఓ ఊబర్ డ్రైవర్ ఇలా చేస్తుండటంతో అతడి స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ ట్విట్టర్ యూజర్ తన అనుభవాన్ని మైక్రో బ్లాగింగ్ సైట్లో రాసుకొచ్చారు. అబ్ధుల్ ఖాదిర్ అనే తన ఆటోడ్రైవర్‌ను మెచ్చుకుంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పలు వివరాలు పంచుకున్నారు.
ఊబర్ డ్రైవర్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలో క్యాబ్‌లో వివిధ రకాల స్నాక్స్, ఫుడ్ కనిపిస్తుంది. ఇక రెండు డిస్ప్లే బోర్డులు కూడా ఈ పిక్‌లో కనిపిస్తాయి. ఓ బోర్డులో వైఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేస్తూ అన్ని సేవలు ఉచితమని రాయగా, మరో బోర్డులో అన్ని మతాల ప్రజలను గౌరవించాలని రాసిఉంది. మనం వారు వేసుకున్న దుస్తులను బట్టి ఏ మతం అనేది గుర్తిస్తాం..అయితే సవినయ మనవి ఏంటంటే మనం అందరి పట్ల మర్యాదగా వ్యవహరించాలి..సమాజం కోసం మనం చేసే పనులతో స్ఫూర్తి రగిలించాలని ఆ బోర్డులో రాసుకొచ్చారు.
నేనివాళ ఓ ఆసక్తికర ఊబర్ డ్రైవర్ అబ్దుల్ ఖాదిర్(48)ను కలిశాను. అతడి వద్ద ఫస్ట్‌ఎయిడ్ కిట్‌తో పాటు రైడర్ల కోసం ఉచితంగా పలు వస్తువులు, ఆహార పదార్ధాలున్నాయి. పేద పిల్లల కోసం డొనేషన్ బాక్స్ కూడా ఉండగా ఖాదర్ ఏడేండ్లలో ఏ ఒక్క రైడ్‌ను క్యాన్సిల్ చేయకపోవడం ఆకట్టుకుందని క్యాబ్ డ్రైవర్ ఫొటోను షేర్ చేస్తూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పెద్దసంఖ్యలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Read More :
17 ఏళ్ల కారు డ్రైవర్‌ను షూట్ చేసిన పోలీసులు.. ఫ్రాన్స్‌లో 150 మంది అరెస్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Snacks
- Uber driver
- Wi-Fi
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

