France Police: 17 ఏళ్ల కారు డ్రైవర్‌ను షూట్ చేసిన పోలీసులు.. ఫ్రాన్స్‌లో 150 మంది అరెస్టు
Police Killing: పారిస్‌లో జరుగుతున్న అలర్లలో 150 మందిని అరెస్టు చేశారు. 17 ఏళ్ల డెలివరీ డ్రైవర్‌ను పోలీసులు షూట్ చేసిన కేసులో అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. శివారు కూడళ్లలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
పారిస్: ఫ్రెంచ్ పోలీసులు(France Police) 17 ఏళ్ల డ్రైవర్‌ను కాల్చి చంపిన ఘటన ఆ దేశంలో తీవ్ర అల్లర్లు సృష్టిస్తోంది. పారిస్ నగర శివారు ప్రాంతమైన నాన్టెర్రిలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ట్రాఫిక్ చెకింగ్ సమయంలో పోలీసులు అతన్ని లైసెన్స్ అడిగారు. ఆ సమయంలో ఓ పోలీసు తన చేతుల్లో ఉన్న గన్ తీసి డ్రైవర్ వైపు గురి పెట్టినట్లు వీడియోలు రిలీజ్ అయ్యాయి. అయితే ట్రాఫిక్ చెకింగ్ నుంచి తప్పించుకుని వెళ్తున్న ఆ 17 ఏళ్ల నెయిల్ అనే కుర్రాడిని పోలీసులు కాల్చారు. ఆ టీనేజర్ మృతిచెందడంతో.. పారిస్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి.

Parissuburb
గత రెండు రోజుల నుంచి పారిస్ మండిపోతోంది. నగరంలో అన్ని ప్రాంతాలతో పాటు ఇతర నగరాల్లోనూ ఆ డ్రైవర్ మృతి పట్ల నిరసనల జ్వాలలు అంటుకుంటున్నాయి. కార్లను, షాపులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేశారు. డెలివరీ డ్రైవర్ మృతి పట్ల ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబప్పె నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

