హైదరాబాద్: ఓ భారీ వాహనానికి చెందిన టైర్ పంక్చర్ (Tyre puncture) అయింది. దీంతో దానిని బాగు చేయించడానికి పంక్చర్ షాపుకు తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులు దానికి పంక్చ్ వేస్తున్నారు. ఈ క్రమంలో టైర్లో గాలి పెడుతుండగా పీడనం (Pressure) ఎక్కువై అది ఒక్కసారిగా పేలిపోయింది (Tyre burst). దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు అమాంతం గాల్లోకి అంతెత్తు ఎగిరిపడ్డారు. ఓ వ్యక్తి చెయ్యికి గాయమైంది. మరొకరు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో అక్కడనున్న వారు భయాందోళనలకు గురయ్యారు. ఇదంతా ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఇది ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది.