బెయిల్ దొరికినా.. జైలులోనే మంత్రులు

కోల్‌కతా : నారద స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడిన ఇద్దరు బెంగాల్ మంత్రులకు బెయిల్ దొరికినా.. వారితో పాటు మరో ఇద్దరు తృణమూల్ నేతలు సోమవారం రాత్రి జైలులోనే గడిపారు. తమ మంత్రులను కాపాడుకునేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం ఉదయం మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్ర, సోవన్ ఛటర్జీలు కూడా రాత్రంతా జైలులోనే గడిపారు. అయితే తనను కూడా అరెస్టు చేయాలంటూ బెంగాల్ సీఎం దీదీ .. సీబీఐ ఆఫీసుకు వెళ్లి హంగామా చేసిన విషయం తెలిసిందే. ఏడు గంటల డ్రామా తర్వాత నలుగురు తృణమూల్ నేతలకు బెయిల్ దొరికినా.. సాయంత్రం ఆ బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది.
తృణమూల్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. మరో రాష్ట్రంలో విచారణ చేపట్టేందుకు కేసును బదిలీ చేయాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో నారద స్టింగ్ ఆపరేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ నేతలు జైలు కస్టడీలోనే ఉంటారని కోర్టు చెప్పింది. నలుగురిని కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. బుధవారం ఈ కేసులో తదుపరి విచారణ ఉంటుంది. 2104లో జరిగిన నారద స్టింగ్ ఆపరేషన్‌లో సువేందు అధికారి కూడా ఉన్నాడు. ప్రస్తుతం సువేందు బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని తృణమూల్ నేతలు ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

