Kolhapur: కొల్హాపూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు, వాహనాలకు నిప్పు
Kolhapur: కొల్హాపూర్లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాత్రి 10 గంటలకు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ ఫుట్బాల్ క్లబ్ సంబరాలు ఘర్షణకు దారి తీశాయి.
ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్(Kolhapur)లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. సిద్ధార్థనగర్లో ఈ ఘటన జరిగింది. రెండు గ్రూపులు తగాదాకు దిగాయి. ఆ తర్వాత రాళ్లు రువ్వుకున్నారు. విధ్వంసం సృష్టించారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. రాజ్భాగేశ్వర్ ఫుట్బాల్ క్లబ్ 31 ఏళ్ల సంబరాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది. ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దీని పట్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే ఆ సమయంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.
రాత్రి 10 గంటల సమయంలో రెండు గ్రూపులు రాళ్లు రువ్వుకున్నాయి. రెండు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు, ఆటోలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమారు 200 మందిని మోహరించారు. రెండు గ్రూపుల మధ్య తప్పుడు అవగాహనతో ఘర్షణ జరిగినట్లు భావిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోల్హాపూర్ ఎస్పీ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

