Nipah Virus | నిపా వైరస్ కలకలం.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
Nipah Virus | కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Nipah Virus | తిరువనంతపురం : కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో సెలవులు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రెండు రోజుల పాటు విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించవచ్చని పేర్కొన్నారు. యూనివర్సిటీల ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. 24 ఏండ్ల హెల్త్ వర్కర్‌కు నిఫా సోకినట్లు బుధవారం నిర్ధారణ అయింది.
కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రస్తుతం వెలుగు చూసిన నిపా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలదని తెలిపింది. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

