Brothers Set Sister On Fire | మతాంతర వ్యక్తితో సంబంధంపై సోదరులు ఆగ్రహం.. సోదరిని హత్య చేసి నిప్పు
Brothers Set Sister On Fire | మతాంతర వ్యక్తితో సోదరి సంబంధంపై సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను హత్య చేసి మృతదేహానికి నిప్పుపెట్టారు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
లక్నో: మతాంతర వ్యక్తితో సోదరి సంబంధంపై సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను హత్య చేసి మృతదేహానికి నిప్పుపెట్టారు. (Brothers Set Sister On Fire) దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 30న అట్రౌలీ ప్రాంతంలో రోడ్డు పక్కన పాక్షికంగా కాలిన యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, యువతి హత్యపై పోలీసులు దర్యాప్తు చేశారు. పలు ప్రాంతాల్లోని 125 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. 129 గ్రామాల నుంచి అదృశ్యమైన యువతుల గురించి ఆరా తీశారు. చివరకు మృతురాలిని 18 ఏళ్ల సంగీతా సైనీగా గుర్తించారు. ఆమె గురించి ఆరా తీయగా మే 15న ప్రేమించిన మతాంతర వ్యక్తితో కలిసి ముంబైకి వెళ్లినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు సంగీతా కాలిన మృతదేహాన్ని గుర్తించిన రోజున ఆమె సోదరులు ఆ మార్గంలో ఒక వాహనంలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం దుర్గేష్ సైనీ, రవి సైనీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మతాంతర వ్యక్తితో సంబంధాన్ని వ్యతిరేకించిన తాము పదునైన ఆయుధంతో తలపై కొట్టి సంగీతను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి రోడ్డు పక్కగా నిప్పంటించినట్లు వెల్లడించారు. దీంతో సోదరులైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

