అసోంలో ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్టు
Al Qaeda | అసోంలో మరో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదాతో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) సభ్యులుగా గుర్తించారు. అల్‌ఖైదాతో సంబంధమున్న
దిస్పూర్: అసోంలో మరో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదాతో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) సభ్యులుగా గుర్తించారు. అల్‌ఖైదాతో సంబంధమున్న ఏబీటీ అసోంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రెండు రోజుల క్రితం మదర్సా బోధకుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు బార్పేటా, తమూల్పూర్, నల్బరీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఉగ్రవాదులతో సంబంధాలన్నాయనే ఆరోపణలతో ఆగస్టు తర్వాత రాష్ట్రంలో నాలుగు మదర్సాలను కూల్చివేసిన విషయం విధితమే. జిహాదీ కార్యకలాపాలకు అసోం అడ్డాగా మారిందని సీఎం హిమంత బిశ్వ ఇప్పటికే ప్రకటించారు. టెర్రరిస్టు కార్యకలాపాలను అడ్డుకోవడంలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి మదర్సాల్లో బోధించడానికి వచ్చేవారు తప్పనిసరిగా తమ పేర్లను రిజిస్ట్రర్ చేయించుకోవాలని సూచించారు. కాగా, గత ఏప్రిల్ తర్వాత ఉగ్రవాదులతో సంబంధాలున్న 45 మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ABT
- Al qaeda
- Assam
- CM Himanta Biswa
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

