చెన్నై: త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ మ్యానిఫెస్టోను గురువారం విడుదల చేశారు. పేదింటి అమ్మాయి పెండ్లికి 8 గ్రాముల బంగారం, నాణ్యమైన పట్టుచీర అందజేస్తామని హామీ ఇచ్చారు. 60 ఏండ్లలోపు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
5 ఎకరాల్లోపు రైతులకు పంట రుణాలు మాఫీ, క్వింటా ధాన్యంపై రూ.3,500 కనీస మద్దతు ధర చెల్లింపు, స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, యువతకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలు మ్యానిఫెస్టోలో ప్రకటించారు.