Tamil Nadu CM Vijay : టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) ప్రమాణస్వీకార కార్యక్రమం అశేష జనసందోహం నడుమ జరిగింది. ‘విజయ్ అనే నేను..’ అంటూ ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Viswanath Arlekar).. విజయ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం (Jawaharlal Nehru Indore Stadium) లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తదితరులు హాజరయ్యారు. సరిగ్గా ఉదయం 10.30 గంటలకు విజయం ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj
— ANI (@ANI) May 10, 2026
ఈ కార్యక్రమానికి విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో స్టేడియం అంతా సందడి నెలకొన్నది. ఈ కార్యక్రమంలో సినీనటి త్రిష కూడా మెరిశారు. ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక విజయ్‌తోపాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వామపక్షాలు క్యాబినెటల్లో చేరేందుకు నిరాకరించడంతో వారి మంత్రివర్గంలో చోటుకల్పించలేదు.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఎన్ ఆనంద్, ఆదవ అర్జున, కేఏ సెంగోటియన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పీ వెంకటరమణన్, సీఆర్ నిర్మల్ కుమార్ ఉన్నారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 స్థానాల్లో గెలుపుతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు కూడగట్టి.. విజయ్ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు స్టేడియానికి చేరుకున్న గవర్నర్ అర్లేకర్‌కు విజయ్ శాలువా కప్పి స్వాగతం పలికారు.