హైదరాబాద్: గగన్‌యాన్ మిషన్(Mission Gaganyaan)లో భాగంగా టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్‌ను ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో తన ట్వీట్లో తెలిపింది. టెస్ట్ మాడ్యూల్‌కు చెందిన కొత్త ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్లో పోస్టు చేసింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్ ఉంటుంది. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఆ ప్రాజెక్టులో కీలకమైన క్రూ మాడ్యూల్ (Gaganyaan Crew Module)పరీక్షకు ఇస్రో సిద్దమైంది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ మాడ్యూల్ టీవీ-డీ1ను లాంచింగ్ కోసం ఇటీవల కాంప్లెక్స్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
పీడనం లేనటువంటి క్రూ మాడ్యూల్ లోనే వ్యోమగాములు నింగిలోకి వెళ్తారు. ఈ పరీక్ష సమయంలో ఆ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది. సముద్రం నుంచి ఇండియన్ నేవీ ఆ మాడ్యూల్ మెషన్‌ను భూమ్మీదకు తీసుకువస్తుంది. టీవీ-డీ1మాడ్యూల్ నిర్మాణం తుది దశలో ఉందని, ఈ మాడ్యూల్ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత.. అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమి మీదకు వస్తుందని ఇస్రో ఇటీవల తెలిపింది.
పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 దిగుతుంది. శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్కానున్నది.
Mission Gaganyaan:
The TV-D1 test flight is scheduled for
🗓️October 21, 2023
🕛between 7 am and 9 am
🚩from SDSC-SHAR, Sriharikota #Gaganyaan pic.twitter.com/7NbMC4YdYD— ISRO (@isro) October 16, 2023