Trivial matter | వంద లంచం చాలా చిన్న విషయం.. అవినీతి కేసు అధికారికి హైకోర్టు ఊరట
Trivial matter | లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.
ముంబై: లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. 2007లో పూణె జిల్లాకు చెందిన పింగళే అనే వ్యక్తి పౌడ్లోని గ్రామీణ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అనిల్ షిండే వద్దకు వెళ్లాడు. మేనల్లుడు దాడి చేయడంతో గాయపడిన తనకు ఆ మేరకు ధృవీకరణ పత్రం ఇవ్వాలని కోరాడు. డాక్టర్ షిండే లంచంగా రూ.100 డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ షిండే వంద లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
కాగా, ఈ కేసుపై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక కోర్టు డాక్టర్ షిండే నిర్దోషిగా 2012 జనవరిలో తీర్పు ఇచ్చింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జితేంద్ర జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ మంగళవారం ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. 2007లో లంచంగా వంద తీసుకోవడం అన్నది చాలా చిన్న విషయమని కోర్టు వ్యాఖ్యానించింది. అవినీతి చట్టంలో కూడా దీని గురించి స్పష్టంగా ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో వైద్యాధికారి షిండేను నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

