కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌తో లింకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మానిక్ భట్టాచార్య(MLA Manik Bhattacharya)ను ఇవాళ అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఆయన్ను ప్రశ్నించింది. ఈ స్కామ్‌తో లింకు ఉన్న రెండవ తృణమూల్ పార్టీ నేత ఆయన. ఈ స్కామ్‌తో లింకు ఉన్న మాజీ మంత్రి పార్ధా ఛటర్జీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పార్ధా ఛటర్జీతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే భట్టాచార్యను ఇవాళ మెడికల్ పరీక్షకు తీసుకువెళ్లనున్నారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.