కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భమ్ ఘటనపై బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. తోపులాటలో తృణమూల్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ ముక్కు పగిలింది. ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారితో పాటు మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల అంశంపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. సభలో జరిగని రభస గురించి బీజేపీ నేతలు వీడియో షేర్ చేశారు. ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య, ప్రతినిధి షెహజాద్ జై హింద్‌తో పాటు అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభలో అడ్డుకున్నారు. రెండు వర్గాల ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించారు.
బీజేపీ నేత సువేందు తనను కొట్టినట్లు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ తెలిపారు. అసిత్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. శాంతి భద్రతలపై స్టేట్మెంట్ ఇవ్వమంటే, సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులు తమపై దాడికి దిగారని సువేందు ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు భద్రత లేదని, 10 మంది ఎమ్మెల్యేలను కొట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని, మా ఎమ్మెల్యేలను వాళ్లు కొట్టారని తృణమూల్ నేత, మంత్రి ఫిర్హద్ హకీమ్ తెలిపారు. వారం క్రితం బీర్భమ్ జిల్లాలో 8 మందిని సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కోల్‌కతా కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
— Amit Malviya (@amitmalviya) March 28, 2022