Manipur Violence: మణిపూర్‌లో భారీ హింస.. రంగంలోకి దిగిన ఆర్మీ
Manipur Violence: మణిపూర్ మండిపోతోంది. ఎస్టీలు నిర్వహించిన ర్యాలీ .. భారీ హింసకు దారి తీసింది. మైటిస్ అనే తెగకు ఎస్టీ హోదా ఇవ్వరాదు అని దాదాపు 8 జిల్లాల్లో ఆందోళనలు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది.
ఇంపాల్: మణిపూర్(Manipur)లో గిరిజన గ్రూపులు చేస్తున్న ఆందోళన వల్ల 8 జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్టీ హోదా గురించి ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ గిరిజనలు నిరసనలు చేపట్టారు. నిన్న రాత్రి ఇంపాల్, చురాచంద్పూర్, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింస(Violence) చెలరేగింది. దీంతో మొత్తం 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది.
పరిస్థితుల్ని అదపులోకి తెచ్చేందుకు ఆర్మీనిక రంగంలోకి దింపారు. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ దళాలు హింసాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఆర్మీ క్యాంపుల్లో దాదాపు 7500 మందికి ఆశ్రయం కల్పించారు. మైటిస్ వర్గానికి గిరిజన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
మణిపూర్ కాలిపోతోందని, దయ చేసి ఆదుకోండి అని బాక్సర్ మేరీ కోమ్ తన ట్వీట్లో కోరారు. గత రాత్రి నుంచి మణిపూర్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు ఆమె చెప్పారు. హింసలో కొందరు తమ కుటుంబసభ్యుల్ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
ఏటీఎస్యూఎం ఆధ్వర్యంలో గిరిజన సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మైటిస్ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని ఆ సంఘం వ్యతిరేకిస్తోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మైటిస్ వర్గం ఇటీవల ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసింది. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో.. గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్‌తో అక్కడ పరిస్థితి గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

