Rajasthan | 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్’.. రాజస్థాన్ గిరిజనుల డిమాండ్
రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్‌లో ఉన్న పాత 33 జిల్లాల్లో 12 జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలన్నారు.
Rajasthan | జైపూర్, జూలై 18: రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్’ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్‌లో ఉన్న పాత 33 జిల్లాల్లో 12 జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలన్నారు. భిల్ సొసైటీకి చెందిన ఆదివాసి పరివార్ సహా 35 సంస్థల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పండిట్ల ఆదేశాలు ఎంతమాత్రం పాటించవద్దని ఆదివాసీ పరివార్ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు మనేక దామోర్ గిరిజన మహిళలకు పిలుపునిచ్చారు. ‘గిరిజన కుటుంబాలు సిందూరం పెట్టుకోవద్దు, మంగళ సూత్రం ధరించ వద్దు. గిరిజన మహిళలు, బాలికలు విద్యపై దృష్టి సారించండి. ప్రతి ఒక్కరూ ఇక నుంచి ఉపవాసాలు మానండి. మనం హిందువులం కాదు’ అని ఆమె అన్నారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను తమ పార్టీ ఎప్పటి నుంచో దీనిని చేస్తున్నదని భారత్ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్‌కుమార్ రోట్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

