IT Raids : మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో 600 లాకర్లు.. మూడు రోజులుగా ఐటీ రైడ్స్
IT Raids : ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో మూడు రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతూనే వున్నాయి. ఆయన పేరు రామ్ నారాయణ్ సింగ్. నోయిడాలో

IT Raids : ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో మూడు రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతూనే వున్నాయి. ఆయన పేరు రామ్ నారాయణ్ సింగ్. నోయిడాలో వుంటున్న సింగ్ ఇంట్లోనే మూడు రోజులుగా ఐటీ అధికారులు తిష్ఠ వేసుకున్నారు. ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో దాదాపు 600 లాకర్లున్నాయి. దీంతో మూడు రోజులుగా ఐటీ విభాగపు అధికారులు తనిఖీలు చేస్తూనే వున్నారు. ఈయన యూపీలో ప్రాసిక్యూషన్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ బంగ్లాలోని ప్లేస్‌మెంట్‌లోనే ఈ మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం లాకర్లను అద్దెకు ఇస్తుంటుంది. గత ఐదేళ్లుగా ఈ మాజీ ఐపీఎస్ అధికారితో సహా మరికొందరు కూడా ఈ పనిలోనే వున్నారు.
అయితే ఈ లాకర్లలో ఆ మాజీ ఐపీఎస్ డబ్బులున్నాయని తమకు సమాచారం అందిందని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ఆధారంగానే తాము దాడులు చేస్తున్నామని, ఈ సందర్భంగా నేలమాళిగల్లో దాదాపు 600 లాకర్లను తాము కనుగొన్నామని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ బినామీ పేర్లతో వున్న దాదాపు 5 లాకర్లను కట్టర్లతో కట్ చేసినట్లు సమాచారం. అలాగే 3 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లాకర్ల నిర్వహణలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని ఐటీ అధికారుల ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

