Transgender | ట్రాన్స్‌జెండర్ నుంచి రక్తం తీసుకోవడానికి నిరాకరించిన హెల్త్‌వర్కర్.. తర్వాత ఏం జరిగిందంటే?
పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో (Kolkata) హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. హెచ్ఐవీ (ఎయిడ్స్) వచ్చే అవకాశం అధికంగా ఉంటుందనే కారణంతో ట్రాన్స్‌జెండర్ (Transgender) నుంచి రక్తం తీసుకోవడానికి ఆరోగ్యకార్యకర్తలు (Health worker) నిరాకరించారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో (Kolkata) హెచ్ఐవీ (ఎయిడ్స్) వచ్చే అవకాశం అధికంగా ఉంటుందనే కారణంతో ట్రాన్స్‌జెండర్ (Transgender) నుంచి రక్తం తీసుకోవడానికి ఆరోగ్యకార్యకర్తలు (Health worker) నిరాకరించారు. కోల్‌కతాలోని బన్హుగ్లీలో (BanHughly) రక్తదాన శిబిరం (Blood donation camp) ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రక్తం ఇవ్వడానికి ఓ ట్రాన్స్‌జెండర్ అక్కడికి వచ్చాడు. అయితే హెచ్ఐవీ (HIV) సోకుతుందేమోననే అనుమానంతో ఆరోగ్య కార్యకర్తలు అతడిని క్యాంపులోకి రానివ్వలేదు. దీంతో తనను ఎందుకు అడ్డుకుంటున్నారని వారితో గొడవకు దిగాడు. చాలాసేపు కొనసాగిన వాదోపవాదాల తర్వాత అతని నుంచి రక్తం తీసుకున్నారు.
కాగా, ట్రాన్స్‌జెండర్స్ నుంచి తీసుకోవచ్చా లేదా అనే అంశంపై గైడ్స్లైన్స్లో స్పష్టత లేదని మెడికల్ బ్యాంక్ కోల్‌కతా సెక్రెటరీ డీ.దినేశ్ అన్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్ల నుంచి రక్తం తీసుకోవడానికి డాక్టర్లు తిరస్కరించినట్లు తెలిసిందని చెప్పారు. ఇది మానవ హక్కులను ఉల్లంఘించినట్లేనని ఏపీడీఆర్ (APDR) ప్రధాన కార్యదర్శి రంజిత్ సుర్ (Ranjit sur) అన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించకూడదని చెప్పారు. ట్రాన్స్‌జెండర్, గే, హోమోసెక్సువల్ లేదా లెస్బియన్ల నుంచి రక్తం తీసుకోవడానికి నేషనల్ బ్లెడ్ ట్రాన్స్‌ఫుజన్ కౌన్సిల్ నిబందనలు ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. అయితే దీని వెనుకున్న కారణాలను మాత్రం పేర్కొనలేదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

