Tamil Nadu | దక్షిణ తమిళనాడును ముంచెత్తిన వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు.. పలు రైళ్లు, విమానాలు రద్దు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు.. ఇప్పుడ దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి.
చెన్నై: తమిళనాడులో (Tamil Nadu) భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు.. ఇప్పుడ దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి (Extremely heavy rains). తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి, విరుద్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అదేవిధంగా ప్రైవేటు సంస్థు, బ్యాంకులకు కూడా హాలీడేఇచ్చారు.
తూత్తుకుడి జిల్లాలోని కోవిల్పట్టి, ఎట్టయపురం, విలాతికుళం, కలుగుమలై, కయతార్, కదంబూర్, వెంబర్, సురంగుడి వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోవిల్పట్టి చుట్టుపక్కల ఉన్న నదులు, సరస్సులు పూర్తి నిండుకున్నాయి, దీంతో నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి. తిరుచెండూరులో అర్ధరాత్రి 1.30 గంటల వరకు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అదేవిధంగా తిరునల్వేలి జిల్లాలోని పాలయంకొట్టయ్‌లో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17.3 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది. కాగా, కన్యాకుమారి, తిరునెల్వెల్లి, తూత్తూకుడి, రామాంతపురం, పూడుకొట్టాయి, తంజావుర్ జిల్లాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. రైల్వే ట్రాకులపై నీరు నిల్వడంతో తిరునల్వేలికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు 17 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా తూత్తుకూడి నుంచి రాకపోకలు సాగించే విమానాలను దారిమళ్లించడంతోపా పలు విమానాలను రద్దుచేశారు.
#WATCH | Tamil Nadu: Water enters homes in Kattabomman Nagar in Thoothukudi due to incessant rainfall. pic.twitter.com/mxoVQ9cB0E
— ANI (@ANI) December 18, 2023
#WATCH | Ramanathapuram, Tamil Nadu: Heavy rain batters Rameswaram.
IMD has predicted heavy to very heavy rainfall over south Tamil Nadu and Kerala today and tomorrow. pic.twitter.com/tbIGTTVwGu
— ANI (@ANI) December 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

