Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Train Derail | అస్సాంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (Kolkata-Sairang Express) రైలు పట్టాలు తప్పింది. అస్సాం (Assam) లోని కామ్రూప్ జిల్లా డిగార్ రైల్వేస్టేషన్ (Digar Railway Station) వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 6.54 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Train Derail : అస్సాంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (Kolkata-Sairang Express) రైలు పట్టాలు తప్పింది. అస్సాం (Assam) లోని కామ్రూప్ జిల్లా డిగార్ రైల్వేస్టేషన్ (Digar Railway Station) వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 6.54 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇంజిన్‌తో సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గువాహటి స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్ నుంచి బయల్దేరింది. ఇవాళ మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతున్న వేళ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పట్టాలు తప్పి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

