విరిగిపడిన కొండచరియలు.. జాతీయ రహదారిపై రాకపోకలు బంద్
landslide | జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. దీంతో అధికారులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. దీంతో అధికారులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉధంపూర్‌లోని సమ్రోలి సెక్షన్‌లోని దేవల్ బ్రిడ్జ్ సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద కొండచరియ విరిగిపడింది. దీంతో హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.

రోడ్డుకు అడ్డంగా ఉన్న కొండచరియలను తొలగిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత తొందరగా ట్రాఫిక్ ను పునరుద్ధరిస్తామన్నారు. 270 కిలోమీటర్ల పొడవును ఈ హైవేపై జమ్ము నుంచి చెనాని, పట్నిటాప్, దోడా, రాంబన్, గూల్, బనిహల్, శ్రీనగర్ వైస్-వెర్సా వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశామన్నారు. దీంతో జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

