Toll Fee | ఏడాదికి మూడు వేల టోల్ ఫీజు.. వాహనదారులకు కేంద్రం అన్లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్!
Toll Fee | రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Toll Fee | ఢిల్లీ, ఏప్రిల్ 15: రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా రూ.3 వేలు చెల్లించి ఏడాది పాటు టోల్ రుసుం చెల్లించకుండా ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కార్లు ఏడాది పాటు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా ఎంచక్కా చక్కర్లు కొట్టవచ్చు.
ఈ మొత్తాన్ని ఫాస్టాగ్ అకౌంట్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, కాలపరిమితి ముగియనున్న టోల్ బూత్‌ల సంఖ్యను కూడా తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, దీనికి రోడ్లు, రహదారులు నిర్మించిన కాంట్రాక్టర్లు, సంస్థలతో ముందుగా చేసుకున్న ఒప్పందాలు ఈ పాలసీ అమలుకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అడ్డంకి అధిగమించేందుకు సదరు సంస్థలు, ఏజెన్సీలతో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖాధికారులు రెండుసార్లు చర్చలు జరిపినట్టు సమాచారం. అంతేకాదు, ఈ పథకం పరిధిలోకి రావాలని రాష్ర్టాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
మే 1 నుంచి శాటిలైట్ టోల్ సిస్టమ్!
ఇకపై టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన కష్టాలు కూడా తీరనున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నది. ఈ విధానాన్ని మొదట కొన్ని రూట్లలో అమలు చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

