Watch: పామును పట్టుకుని ఇంట్లోకి తెచ్చేందుకు బాలుడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Toddler Plays With Snake | చిన్నారుల చేష్టలు వింతగా ఉంటాయి. భయమంటే తెలియని పిల్లలు సాహసాలు చేస్తుంటారు. అలాంటి ఒక బుడతడు ఏకంగా పాముతో ఆడుకున్నాడు (Toddler Plays With Snake). దానిని చేతితో పట్టుకుని ఇంటి లోపలకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు.
న్యూఢిల్లీ: చిన్నారుల చేష్టలు వింతగా ఉంటాయి. భయమంటే తెలియని పిల్లలు సాహసాలు చేస్తుంటారు. అలాంటి ఒక బుడతడు ఏకంగా పాముతో ఆడుకున్నాడు (Toddler Plays With Snake). దానిని చేతితో పట్టుకుని ఇంటి లోపలకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక బాలుడు పామును పట్టుకుని ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీనిని చూసి ఆ ఇంట్లోని పెద్దలు షాక్ అయ్యారు. నేలపై కూర్చొన్న వారు ఒక్కసారిగా పైకి లేచి దూరంగా వెళ్లారు. అలాగే పామును లోపలకు తీసుకురావద్దని, బయటకు తీసుకెళ్లాలంటూ బాలుడికి సైగలు చేశారు. ఇంతలో ఒక వ్యక్తి ఆ బాలుడి మరో చేయి పట్టుకుని పాముతో సహా ఇంటి బయటకు తీసుకెళ్లాడు.
కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆరు లక్షల మందికిపైగా దీనిని లైక్ చేశారు. నెటిజన్లు పలు కామెంట్లు కూడా చేశారు. ఆ ఇంటి పెద్దల నిర్లక్ష్యాన్ని కొందరు విమర్శించారు. మాజీ ప్రియురాలిని తొలిసారి కుటుంబ సభ్యులకు పరిచయం చేసిన సంఘటన గుర్తుకు వచ్చిందని ఒకరు చమత్కరించారు. జంగిల్ బుక్ విలేజ్ బుక్‌గా మారిందని ఒకరు, యంగ్ మోగ్లీ చివరకు గ్రామానికి తిరిగి వచ్చాడని మరొకరు వ్యాఖ్యానించారు. పాము పెయిడ్ యాక్టర్‌గా మారిందని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

