World Animal Day | ఇవాళ ప్రపంచ జంతు సంక్షేమ దినం.. జంతువులను ప్రేమిద్దాం.. వాటినీ బతుకనిద్దాం..
జంతువుల హక్కులను కాపాడుతూ వాటి పట్ల ప్రేమను చూపాలన్న ఉద్దేశంతో ఏటా అక్టోబర్ 4 వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినం నిర్వహిస్తున్నారు. జంతువుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతు సంరక్షణ అవసరాలు...
World Animal Day | జంతువులు.. మనతో పాటు నివసించే ప్రాణులు. వాస్తవానికి మనిషి కన్నా ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెప్తున్నది. పర్యావరణ వ్యవస్థలో కీలకమైన జంతు సంపదను పరిరక్షించడంతోపాటు వాటిని వృద్ధి చేసేందుకు మనమంతా కంకణబద్ధులం కావాలి.
జంతువుల హక్కులను కాపాడుతూ వాటి పట్ల ప్రేమను చూపాలన్న ఉద్దేశంతో ఏటా అక్టోబర్ 4 వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినం నిర్వహిస్తున్నారు. జంతువుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతు సంరక్షణ అవసరాలు తెలియజేయడం ఈ దినం ప్రాముఖ్యత.
భూమి ఆవిర్భవించిన అనంతరం చాలా జంతు జాతులు మెల్లమెల్లగా కనుమరుగవుతూ వస్తున్నాయి. చాలా జాతులు ఇప్పుడు మనుగడలో లేవు. ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు చూస్తుండగానే మనకు దూరమవుతున్నాయి. ఇలా వివిధ జంతువుల జాతులు అంతరించి పోకుండా వాటిని పరిరక్షించినప్పుడే ఎకాలాజికల్ బ్యాలెన్స్ సాధ్యమవుతుంది.
వాస్తవానికి మన మనుగడ కోసం జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నాం. అర్ధంపర్ధం లేకుండా అడవుల్ని నరికేయడం వల్ల జంతువులు నివసించేందుకు సరైన ప్రదేశాలు లేకుండా పోయి కాంక్రీట్ జంగిల్లోకి వస్తున్నాయి. తమను తాము బతికించుకోవడం కోసం మనపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి సహజసిద్ధమైన ఆవాసాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటికి కావాల్సిన ఆహారాలను అందేలా చర్యలు తీసుకోవాలి.
మనిషి-జంతువుల మధ్య అవినాభావ సంబంధం చాలా గొప్పది. ఏ జంతువును మనం ప్రేమగా దగ్గరికి తీసుకుంటామో.. అది మన పట్ల విశ్వాసం చూపుతాయి. మనతో సమానంగా అవి కూడా జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. అయితే, వేటగాళ్ల నుంచి కాపాడుకోవడం కష్టంగా మారింది. అనేక రకాలుగా జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వివిధ వృత్తులు, అవసరాలను వాడుకుంటూ వాటిని హింసిస్తున్నారు.
జంతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలుచేయడం ద్వారా జంతువులను కాపాడుకోవచ్చు. మూగ జీవాల పట్ల ప్రేమ, జాలి, దయ, మానవత్వం కలిగి ఉండాలని పిల్లలకు విద్యార్థి దశ నుంచే బోధించడం ద్వారా జంతుజాలాన్ని కాపాడుకోగలం.
చివరగా, మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృధ్ధిచేయడం, తగిన గౌరవాన్ని అందించడం మనందరి బాధ్యత. జంతువులపట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం నేర్చుకుందాం. మనతో పాటు జంతువులనూ బతుకనిద్దాం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

