To Fake Death Man Kills Beggar | 80 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం బిచ్చగాడిని హత్య.. 17 ఏళ్ల తర్వాత నిందితులు అరెస్ట్
To Fake Death Man Kills Beggar | ఇన్సూరెన్స్ డబ్బు కోసం చనిపోయినట్లుగా నమ్మించేందుకు ఒక బిచ్చగాడిని హత్య చేశారు. రూ.80 లక్షల బీమా డబ్బులు పొంది కుటుంబమంతా పంచుకున్నారు. అయితే మారు పేరుతో మరో నగరంలో జీవిస్తున్న ఆ వ్యక్తిని 17 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: ఇన్సూరెన్స్ డబ్బు కోసం చనిపోయినట్లుగా నమ్మించేందుకు ఒక బిచ్చగాడిని హత్య చేశారు. (To Fake Death Man Kills Beggar) రూ.80 లక్షల బీమా డబ్బులు పొంది కుటుంబమంతా పంచుకున్నారు. అయితే మారు పేరుతో మరో నగరంలో జీవిస్తున్న ఆ వ్యక్తిని 17 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని భట్టా పర్సౌల్ గ్రామానికి చెందిన అనిల్ సింగ్ చౌదరీ ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. 2004లో రూ.80 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక కారు కొన్నాడు.
కాగా, తాను చనిపోయినట్లుగా నమ్మించి బీమా డబ్బు పొందేందుకు తండ్రి, సోదరులతో కలిసి అనిల్ సింగ్ ప్లాన్ వేశాడు. 2006 జూలై 31న రైలులో అడుక్కునే బిచ్చగాడిని ఆహారం కోసం ఎరవేశారు. ఆగ్రా సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్లారు. మత్తు మందు కలిపిన ఆహారం పెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ బిచ్చగాడిని కారులోకి ఎక్కించారు. ఒక విద్యుత్ స్తంభానికి కారును ఢీకొట్టారు. మత్తులో ఉన్న బిచ్చగాడిని డ్రైవర్ సీటులో కూర్చొబెట్టారు. ఆ తర్వాత ఆ కారుకు నిప్పుపెట్టారు. విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్ల జరిగిన ప్రమాదంలో ఆ కారు కాలిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ప్రమాదంలో కారు కాలిపోయినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. కారు నంబర్ ఆధారంగా అనిల్ సింగ్ చౌదరీ తండ్రి విజయ్‌పాల్ సింగ్‌ను సంప్రదించారు. అయితే డ్రైవర్ సీటులో కాలి చనిపోయిన వ్యక్తిని తన కుమారుడుగా అతడు గుర్తించాడు. అనంతరం మృతదేహానికి సొంతూరులో అంత్యక్రియలు నిర్వహించాడు. బీమా సంస్థ నుంచి రూ.80 లక్షలు పొందాడు. ఆ డబ్బును కుటుంబ సభ్యులు పంచుకున్నారు.
కాగా, తన వాటా డబ్బు తీసుకున్న అనిల్ సింగ్ అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. రాజ్‌కుమార్ చౌదరీగా పేరు మార్చుకుని ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ఆటోతోపాటు బ్యాంకు రుణం ద్వారా కారు కొని దానిని నడుపుతూ జీవిస్తున్నాడు. సుమారు 17 ఏళ్లుగా సొంతూరుకు దూరంగా ఉన్నాడు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా నాటి నుంచి మాట్లాడలేదు.
అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా భావించిన అనిల్ సింగ్ బతికే ఉన్నాడని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నికోల్ ప్రాంతంలో నివసిస్తున్న 39 ఏళ్ల వయసున్న అతడ్ని ఇటీవల అరెస్ట్ చేసి ప్రశ్నించారు. బీమా డబ్బు కోసం తండ్రితో కలిసి బిచ్చగాడిని హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించడంతో అతడి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

