కోల్కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్పార్టీకి మరో జలక్ తగిలింది. ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఏప్రిల్ 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన నటి కోయల్ మల్లిక్(Koel Mallick) తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎగువ సభలో టీఎంసీకి కష్టాలు మరింత పెరిగాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ ఎంపీ కోయల్ మల్లిక్ రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణనన్కు లేఖ రాశారు. అయితే జూలై 20వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఎంపీ కోయల్ రాజీనామా టీఎంసీకి పెద్ద దెబ్బే అవుతుంది. ఇప్పటికే తృణమూల్ పార్టీకి చెందిన సుకేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బారైక్ రాజ్యసభకు రాజీనామా చేశారు. వాళ్లంతా బీజేపీలో చేరారు. బెంగాల్ నుంచి రాజ్యసభకు బీజేపీపై నామినేషన్ దాఖలు చేశారు.