న్యూఢిల్లీ: అడవిలోని ఏనుగును వేటాడేందుకు ఒక పులి ప్రయత్నించింది. అయితే ఆ ఏనుగు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ప్రతిఘటించడంతో భయపడిన ఆ పులి పిల్లిలా పారిపోయింది. ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఒంటరిగా ఉన్న ఏనుగును వేటాడేందుకు ఒక పులి ప్రయత్నిస్తుంది. అయితే ఏనుగు ఆ పులిని గమనించి ఎదురుదాడికి దిగుతుంది. దీంతో భయపడిన ఆ పులి మరోవైపు పారిపోతుంది. సంతోష్సాగర్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఏనుగును వేటాడేందుకు ప్రయత్నించిన పులి విఫలమైందని పేర్కొన్నారు. ‘పులి భయపెడుతుంది, కానీ పెద్ద ఏనుగును వేటాడి చంపలేదు’ అని శీర్షిక పెట్టారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. ‘నేను ఏనుగును అయితే పులి నన్ను చంపలేదు’ అని ఒకరు అన్నారు. పులి కుక్కలాగా పారిపోయిందని మరొకరు కామెంట్ చేశారు. అడవికి రాజు ఏనుగే అని ఒకరు వ్యాఖ్యానించారు. సాధారణంగా చిన్న ఏనుగులను మాత్రమే పులి వేటాడుతుందని, అయితే రెండు పులులు కలిసి పెద్ద ఏనుగుపై దాడి చేసి చంపగలవని మరొకరు పేర్కొన్నారు.
Tiger can scare but cannot kill a full grown elephant@susantananda3 pic.twitter.com/1kWConQUeK
— Santosh Sagar (@santoshsaagr) October 11, 2022