జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
Encounter | జమ్ముకశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న చవల్కాన్‌లో, హంద్వారాలోని నెచమా, రాజ్వార్ ప్రాంతాల్లో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న చవల్కాన్‌లో, హంద్వారా జిల్లాలోని నెచమా, గందర్బాల్ జిల్లాలోలోని సెర్చ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. మరో ఉగ్రవాదిని పట్టుకున్నామన్నారు.
పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టామన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిని పట్టుకున్నామని చెప్పారు. వారిని జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించామన్నారు. ఇక హంద్వారాలోని నెచామా, రాజ్వార్ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులో లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టు హతమయ్యాడని చెప్పారు.
గండర్బాల్ జిల్లాలోని సెర్చ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడని వెల్లడించారు. ఆప్రాంతాల్లో ఉగ్రవాదులకోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

