Maha Kumbh: మహాకుంభ్‌లో ముగ్గురు శంకరాచార్యుల భేటీ.. సనాతన ధర్మరక్షణకు కీలక తీర్మానాలు
Maha Kumbh: శృంగేరి, ద్వారక, జ్యోతిర్ మఠాలకు చెందిన గురువులు.. కుంభమేళాలో భేటీ అయ్యారు. సనాతన ధర్మ పరిరక్షణకు సూచనలు, తీర్మానాలు చేశారు. గో వధను నిషేధించాలని, గోవులను రాష్ట్రమాతగా ప్రకటించాలని కోరారు.
ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా(Maha Kumbh) సందర్భంగా.. దేశంలోని హిందూ ధర్మాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు భేటీ అయ్యారు. ఆ చరిత్రాత్మక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు సంయుక్త ప్రకటన జారీ చేశారు. సనాతన ధర్మరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. గో వధను ఆపేయాలని ధర్మాదేశం ఇచ్చారు. గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానించారు. దేశ ఐక్యత, సమగ్రత.. సనాతన సంప్రదాయ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను పేర్కొన్నారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌ను విజిట్ చేయాలని సనాతన ధర్మ ఫాలోవర్లకు శంకరాచార్యులు పిలుపునిచ్చారు.
మూడు ప్రముఖ పీఠాలకు చెందిన శంకరాచార్యలు భేటీ కావడం ఇదే మొదటిసారి. శృంగేరి శారదా పీఠంకు చెందిన విధు శేఖర భారతి, ద్వారకా శారదా పీఠానికి చెందిన సదానంద సరస్వతి, జ్యోతిర్ మఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముగ్గరు శంకరాచార్యలు సంయుక్తంగా ప్రకటన రిలీజ్ చేశారు. సనాతన సంస్కృతి వృద్ధి, రక్షణపై 27 మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్యతపై దృష్టి పెట్టాలని శంకరాచార్య సదానంద సరస్వతి తెలిపారు.
గోవును దేశమాతగా గుర్తించాలని కోరుతూ శృంగేరి పీఠాధిపతి విధు శేఖర భారతి తెలిపారు. సంస్కృత విద్య ప్రమోషన్ కోసం కేంద్రం నిధుల్ని కేటాయించాలని అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. నదులు, కుటుంబ వ్యవస్థ సంరక్షణ గురించి శంకరాచార్యులు ప్రకటన చేశారు. మతబోధను హిందువులకు ప్రాథమిక హక్కుగా ప్రకటించాలన్నారు. ఈ దేశంలో గోవులను తల్లిగా పూజిస్తారని, ఇక్కడ గోవధను నిర్మూలించాలన్నారు. గోవులను రాష్ట్రమాతగా ప్రకటించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
Panchayat Grading | పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం.. కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం!
Uttam Kumar Reddy | కార్యకర్తలకు న్యాయం జరుగలేదు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

