Jaipur | జైపూర్ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
Jaipur : రాజస్థాన్ రాజధాని జైపూర్ పరిధిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Jaipur : రాజస్థాన్ రాజధాని జైపూర్ పరిధిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జైపూర్ పరిధి, నాగోరియన్ ప్రాంతంలోని ఒక టపాసుల పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది.
ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా మంటలు భారీగా వ్యాపించాయి. చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఈ మంటలు, పొగల ధాటికి అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. చాలాసేపు శ్రమించి అక్కడి మంటల్ని ఆర్పేశారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. టపాసుల పరిశ్రమలో ఎలాంటి టపాసులు తయారు చేస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఎంత మంది పని చేస్తున్నారు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక, ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా తెలియలేదు. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

