Indian Penal Code | భారత శిక్షాస్మృతి (IPC) స్థానంలో నూతన చట్టం.. లోక్‌సభలో బిల్లు
Indian Penal Code | బ్రిటిష్ ఇండియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతి (Indian Penal Code)కి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్ పీనల్ కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: బ్రిటిష్ ఇండియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతి (Indian Penal Code)కి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్ పీనల్ కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపనున్నట్లు కేంద్ర హోమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు బ్రిటిష్ హయాం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Code of Criminal Procedure), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (Indian Evidence Act) లను కూడా కేంద్రం తొలగించనుంది. వాటి స్థానంలో కూడా కొత్త బిల్లులను రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో చేయబోయే కొత్త చట్టం కోసం ‘ది భారతీయ న్యాయ సంహిత – 2023’ బిల్లును తీసుకొచ్చింది.
అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో కొత్త చట్టం కోసం ‘ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023’ బిల్లును, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టం కోసం ‘ది భారతీయ సాక్ష్య బిల్లు – 2023’ను రూపొందించింది. ఈ మూడు బిల్లులను హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటన్నింటిని సూక్ష్మ పరిశీలనకై పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపనున్నట్లు తెలిపారు.
ఈ పాత కాలం నాటి చట్టాలు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాపాడేవిగా, బలోపేతం చేసేవిగా ఉన్నాయని, అంతేగాక ఆ చట్టాల తుది లక్ష్యం శిక్షించడమే తప్ప న్యాయం చేయడం కాదని హోంమంత్రి పేర్కొన్నారు. అందుకే ఆ కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు చేస్తున్నామన్నారు. కొత్త చట్టాల ద్వారా భారత పౌరులకు న్యాయం జరుగుతుందని, వారి హక్కులకు రక్షణ ఉంటుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

