రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు బెదిరింపులు!
Swati Maliwal | లైంగిక వేధింపుల ఆరోపణలపై సినీ నిర్మాత సాజిద్‌ఖాన్‌ను బిగ్‌బాస్ నుంచి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ (DCW) స్వాతి మలివాల్ లేఖ రాశారు. అయితే, అప్పటి
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలపై సినీ నిర్మాత సాజిద్‌ఖాన్‌ను బిగ్‌బాస్ నుంచి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ (DCW) స్వాతి మలివాల్ లేఖ రాశారు. అయితే, అప్పటి నుంచి రేప్ చేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బుధవారం ఆమె తెలిపారు. సాజిద్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి బెదిరింపులకు దిగుతూ.. సహజంగానే మా పనిని ఆపాలనుకుంటున్నారన్నారు. ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలంటూ ఆమె ట్వీట్ చేశారు.
#MeToo ఉద్యమం సందర్భంగా పది మంది మహిళలు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాజాద్ ఖాన్‌పై వచ్చిన ఫిర్యాదులు.. అతని అసహ్యకరమైన మనస్తత్వాన్ని చూపుతుందని, తప్పుడు వ్యక్తికి బిగ్‌బాస్‌లో చోటు కల్పించారని, అతన్ని షో నుంచి తొలగించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాసినట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ అక్టోబర్ 1న బిగ్‌బాస్-16 సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. షోలో చిత్ర నిర్మాత సాజిద్ ఖాన్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2018లో సాజిద్ ప్రాజెక్టుల్లో పని చేసిన పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సలోని చోప్రా, షెర్లిన్ చోప్రా, అహానా కుమ్రా, మందన కరీమి తదితర నటీమణులు ఈ జాబితాలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

