మంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు శనివారం బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై సల్మాన్, అతని బృందం బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ బెదిరింపు వెనుక ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ బెదిరింపు ఈ-మెయిల్‌పై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.