జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
అశోకా రోడ్డులోని ఈసీఐ ప్రధాన కార్యాలయానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో బహుళ అంచెల బారికేడ్లను ఛేదించేందుకు ప్రయత్నించిన 100 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- పాల్గొన్న రైతు, కార్మిక, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు
- ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, 100 మందికి పైగా అదుపులోకి
- రోడ్డుపైన బైఠాయించి ప్రజా పార్లమెంట్ నిర్వహణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, వామపక్షాల ప్రతినిధులు సహా వేలాదిమంది శుక్రవారం భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీ నిర్వహించారు. అశోకా రోడ్డులోని ఈసీఐ ప్రధాన కార్యాలయానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో బహుళ అంచెల బారికేడ్లను ఛేదించేందుకు ప్రయత్నించిన 100 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొందరు నిరసనకారులు చెట్టు ఎక్కి జాతీయ జెండాను ఊపేందుకు ప్రయత్నించగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) కార్యకర్తలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య ప్లకార్డులను ప్రదర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని బృందా కారత్ విలేకరులకు తెలిపారు. నిరసనలో పాల్గొన్న సీపీఐ నాయకుడు పీ సందోష్ మాట్లాడుతూ మా నిరసన మరింత తీవ్రమవుతుంది. జ్ఞానేశ్ కుమార్ను ఎవరూ కాపాడలేరు అని అన్నారు. ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పీపుల్ అగైనెస్ట్ సర్, పీపుల్స్ కలెక్టివ్ పిలుపు మేరకు కలిబారి ఆర్గ్, భాయ్ వీర్ సింగ్ మార్గ్ కూడలి వద్ద గోలే దక్ ఖానా సమీపం నుంచి ర్యాలీ ప్రారంభమైంది.
ఈ ర్యాలీ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం),, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల ప్రతినిధులను ఒకచోట చేర్చింది. ఇందులో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్లకు చెందిన వారు పాల్గొన్నారు. ఈసీఐ ప్రధాన కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు అక్కడే బైఠాయించి ప్రజా పార్లమెంట్ నిర్వహించారు. సెంట్రల్ ఢిల్లీ అంతటా ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. ఈ ప్రదర్శననలో బృందా కారత్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్వో) సభ్యులు, క్రాంతికారి యువ సంఘటన్(కేవైఎస్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలు పాల్గొన్నారు.
88 నగరాల్లో నిరసనలు
18 రాష్ర్టాల్లోని 88 నగరాల్లో 145 సంస్థల భాగస్వామ్యంతో నిరసన ప్రదర్శనలకు ప్రణాళికలు రూపొందించినట్టు పీపుల్ అగైనెస్ట్ సర్ ఫోరమ్ తెలిపింది. ఈ కార్యక్రమాలు శుక్రవారం నుంచి నవంబర్ 1 వరకు జరగనున్నాయి. ఆందోళనలో 300కు పైగా సంస్థలు చేరాయని నిర్వాహకులు తెలిపారు.
మేం జైల్లో ఉన్నా ఉద్యమం ఆగదు : సీజేపీ నాయకుల స్పష్టీకరణ
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అనివార్యమని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా పేర్కొన్నారు. ఈ ఉద్యమంతో సంబంధం ఉన్న వారందరూ కలసి నిర్ణయం తీసుకుంటారని, కేవలం సీజేపీ మాత్రమే నిర్ణయించదని వారు తెలిపారు. సభ్యులు జైల్లో ఉన్నా లేదా బయట ఉన్నా ఉద్యమం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని వారు చెప్పారు. మేము నాయకులం కాము. ఈ దేశ ప్రజలు మాకు అప్పగించిన ఈ వేదికకు మేము కేవలం సంరక్షకులము మాత్రమే’ అని పేర్కొన్నారు.
31దాకా సీఏపీఎఫ్ బలగాల మోహరింపు
దేశరాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) బలగాల మోహరింపును ఈ నెల 31వరకు పొడిగించినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఢిల్లీలో ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు మెరుపు నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు 273 సీఏపీఎఫ్ కంపెనీల మోహరింపును కొనసాగించనున్నట్టు చెప్పారు. ఆంక్షలు రెండోసారి పొడిగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడానికి, సీఈసీని కాపాడేందుకే ఈ నిర్ణయం అని మండిపడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

