Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. ఎంత ఖరీదో తెలుసా..?
Elephant poop | కాఫీ అంటే దాదాపు అందరికీ ఇష్టం. ఉదయం ఓ కప్పు కాఫీ (Coffee) తో రోజును ప్రారంభించే వాళ్లు కోట్లలో ఉంటారు. కానీ ఏనుగు పేడ (Elephant poop) నుంచి సేకరించిన గింజలతో తయారు చేసిన కాఫీ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ఏనుగు పేడలోని గింజలతో తయారుచేసిన కాఫీ విలువ కూడా మామూలుగా ఉండదట.
Elephant poop : కాఫీ అంటే దాదాపు అందరికీ ఇష్టం. ఉదయం ఓ కప్పు కాఫీ (Coffee) తో రోజును ప్రారంభించే వాళ్లు కోట్లలో ఉంటారు. కానీ ఏనుగు పేడ (Elephant poop) నుంచి సేకరించిన గింజలతో తయారు చేసిన కాఫీ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ఏనుగు పేడలోని గింజలతో తయారుచేసిన కాఫీ విలువ కూడా మామూలుగా ఉండదట. ఒక కప్పు కాఫీ ధర ఏకంగా రూ.4,700 ఉంటుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే ప్రపంచంలో అత్యంత అరుదైన, ఖరీదైన కాఫీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
థాయ్లాండ్లో తయారయ్యే ‘బ్లాక్ ఐవరీ కాఫీ’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ రకాలలో ఒకటి. దీని ధర కిలోకు దాదాపు 2,000 డాలర్ల వరకు ఉంటుంది. కానీ ఈ ఏనుగు పేడలోని గింజలతో తయారయ్యే ఒక్క కప్పు కాఫీ ధరే సుమారు 50 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4,700 కు పైమాటే. ఈ కాఫీ ప్రత్యేకత ఏంటంటే గింజలను ఏనుగుల జీర్ణవ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేస్తారు. కాఫీ గింజలను బియ్యం, అరటిపండ్లు, ఇతర పండ్లతో కలిపి ఏనుగులకు ఆహారంగా ఇస్తారు. ఆహారం జీర్ణమయ్యే సమయంలో కాఫీ గింజలు కూడా ప్రత్యేక ప్రక్రియకు లోనవుతాయి.
15 నుంచి 17 గంటల తర్వాత ఏనుగుల మల విసర్జన నుంచి ఆ గింజలను సేకరించి శుభ్రపరుస్తారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి కాఫీ తయారు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల కాఫీకి ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుందని కాఫీ ప్రియులు చెబుతున్నారు. ఈ కాఫీ తయారీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. గింజల సేకరణ నుంచి ప్రాసెసింగ్ వరకు ప్రతి దశలో అధిక శ్రమ అవసరం. అలాగే ఉత్పత్తి పరిమితంగా ఉండటం కూడా ధర పెరగడానికి కారణం. కాఫీలో చాక్లెట్, నట్స్, మట్టి వాసనల మిశ్రమ రుచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

